అసలే పేద కుటుంబం. ఉన్నత చదువులు చదవడమే కష్టంగా మారిన ఆ కుటుంబానికి ఆయన అండదండగా నిలిచారు. ఉన్న ఊరు, కన్న తల్లిని ఎప్పటికీ మరవకూడదన్నట్లుగా తనకు తోచిన సాయాన్ని అందించారు రాష్ట్ర ఫుడ్స్ ఛైర్మన్ మేడే రాజీవ్ సాగర్. తన స్వగ్రామమైన సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం వెలుగుపల్లికి చెందిన విద్యార్థినికి.. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ECE సీటు వచ్చింది. గ్రామానికి చెందిన టి.వెంకన్న కుమార్తె గౌతమికి సీటు రాగా.. అందులో చేరాలంటే ఫీజు కట్టే స్థోమత కూడా ఆ కుటుంబానికి లేదు. విషయం తెలుసుకున్న రాజీవ్ సాగర్.. వారి దయనీయ పరిస్థితి చూసి చలించిపోయారు. అండగా తానుంటానంటూ విద్యార్థినికి అయ్యే ఫీజును అందించారు.
తన ఆఫీసుకు పిలిపించుకుని ఆ అమ్మాయితోపాటు తల్లికి డబ్బులు అందించి మానవత్వం చాటుకున్నారు. అంతేకాకుండా చదువు పూర్తయ్యేవరకు తనది బాధ్యత అని ఆ కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు. దయార్ధ్ర హృదయంతో రాజీవ్ సాగర్ స్పందించిన తీరు, అందించిన సాయం పట్ల గ్రామస్థులందరిలోనూ సంతోషం కనిపించింది. అలా పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు రాజీవ్ సాగర్.