గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది ‘కీ’ విడుదల(Release) అయింది. ఫైనల్ ‘కీ’ ని TSPSC అధికారులు విడుదల చేశారు. జూన్ 28న గ్రూప్-1 ప్రిలిమ్స్ కు సంబంధించి ప్రాథమిక(Primary) ‘కీ’ రిలీజయింది. ప్రాథమిక ‘కీ’ ప్రకటించిన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించింది. వాటిని పరిగణలోకి తీసుకున్న TSPSC తాజాగా తుది ‘కీ’ని విడుదల చేసింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత పలు ప్రశ్నలను TSPSC తొలగించింది. అందులో 8 ప్రశ్నలను తొలగించగా.. మరో రెండు ప్రశ్నలకు ఆన్సర్లను మార్చినట్లు ప్రకటించింది. 3, 4, 5, 46, 54, 114, 128, 135 నంబరు గల ప్రశ్నలు తొలగించారు.
ప్రిలిమ్స్ లో 8 ప్రశ్నలు తొలగించినందున ప్రస్తుతం 142 క్వశ్చన్ లే మిగిలాయి. వీటికి వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకుని 150 మార్కులకు దామాషా పద్ధతిలో లెక్కించనున్నారు. ఏవైనా ప్రశ్నలను తొలగించినప్పుడు వాటిని మినహాయించి మిగతా ప్రశ్నలకు క్యాండిడేట్స్ సాధించిన మార్కులనే మొత్తం మార్కుల కింద లెక్కిస్తారు. జూన్ 11న నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ కు 2,33,506 మంది అటెండ్ అయ్యారు.