కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల MLC కౌంటింగ్ తుది దశ(Final Stage)కు చేరుకుంది. రెండో ప్రాధాన్యత లెక్కింపులో భాగంగా ఇప్పటివరకు 53 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. తొలి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు పూర్తి మెజార్టీ రాకపోవడంతో.. మూడో స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ మొదలైంది. BJP అభ్యర్థి అంజిరెడ్డి మొదట్నుంచీ ఆధిక్యంలో కొనసాగుతూనే ఉన్నారు. ప్రసన్న హరికృష్ణకు రెండో ప్రాధాన్యతగా పోలైన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. BSP అభ్యర్థి పసన్న హరికృష్ణకు 63,404 ఓట్లు వచ్చాయి. కోటా నిర్ధారణకు 1,11,672 ఓట్లు రావాల్సి ఉంది.
ఇద్దరు ప్రధాన పోటీదారుల ఓట్లు ఇలా…
అంజిరెడ్డి(బీజేపీ) – (ఓవరాల్ 78,635)
నరేందర్ రెడ్డి(కాంగ్రెస్) – (ఓవరాల్ 73,644)
గెలుపు కోటాలో అభ్యర్థులకు అవసరమయ్యే ఓట్లు ఇలా…
అంజిరెడ్డి(బీజేపీ) – 33,037
నరేందర్ రెడ్డి(కాంగ్రెస్) – 38,028