
పలు శాఖల్లో కొత్త పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చింది. వివిధ శాఖల్లో 14,954 పోస్టులకు అనుమతినిస్తూ ఆ శాఖ విభాగం ఆదేశాలు వెలువరించింది. రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 2,113 రికార్డ్ అసిస్టెంట్లు మరో 679 సబార్డినేట్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మిషన్ భగీరథ డిపార్ట్ మెంట్ లో 3,372 హెల్పర్ పోస్టులు, నీటిపారుదల శాఖలో 5,063 లష్కర్లతోపాటు హెల్పర్ పోస్టుల మంజూరుకు అనుమతిచ్చింది. అటు పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాటిలో ఉన్నాయి.
VRAల సర్దుబాటు కోసం పోస్టులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. అందుకు ఆర్థిక శాఖ సమ్మతిస్తూ ఆర్డర్స్ రిలీజ్ చేసింది.