రాష్ట్రంలో వరదల వల్ల కలిగిన నష్టం(Damage) రూ.10,320 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికం(Highest)గా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ పరిధిలోని రోడ్లకు కలిగిన నష్టం రూ.7,693 కోట్లుగా గుర్తించింది. ఇప్పటికే కేంద్ర బృందం పర్యటించి వివరాలు తెలుసుకోగా.. రాష్ట్ర అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు నమోదు చేశారు.
పట్టణాభివృద్ధికి 1216, నీటిపారుదల 483, తాగునీటి సరఫరాకు 331, వ్యవసాయం 231, విద్యుత్తు 179, కమ్యూనిటీ ఆస్తులు, భవనాలు 70, మత్స్యశాఖ 56, స్కూల్ బిల్డింగ్స్ 27, హౌజింగ్ 25, పశుసంవర్ధకం 4.35, మృతుల కుటుంబాలకు 1.40 కోట్ల రూపాయల చొప్పున ఆస్తి నష్టం జరిగినట్లు రిపోర్టులో వెల్లడించింది.