రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించి సోనియాకు జన్మదిన కానుక అందిద్దామని పిలుపునిచ్చారు. ఈ మధ్య జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ అక్కడి పార్టీ నేతలు ఇదే తరహా హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నారు.