
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్(hussain sagar) జలాశయానికి భారీగా ఫ్లడ్ వాటర్ వచ్చి చేరుతోంది. ఇప్పటికే నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. దీంతో 2 వేల క్యూసెక్కుల్ని కిందకు వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 514.75 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 513.5 మీటర్లకు చేరుకుంది. సమీప ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా DRF, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను GHMC సిద్ధం చేసింది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వార్నింగ్ ఇచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, GHMC కమిషనర్ రొనాల్డ్ రోస్.. సాగర్ తోపాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నాలాలు డెవలప్ చేయడం వల్ల ప్రస్తుతానికి ఇబ్బందులేం లేవని, అయితే అక్రమ కట్టడాలతో నాలాలు ప్రమాదంలో చిక్కుకున్నాయన్న ఆయన.. వాటిని త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు.
ఇక జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సైతం నిండుగా మారాయి. వికారాబాద్, తాండూరు, షాద్ నగర్ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఈ రెండు ప్రాజెక్టులు ఫుల్ కెపాసిటీకి చేరుకున్నాయి. హిమాయత్ సాగర్ నీటిమట్టం 1763.50 అడుగులకు గాను మొత్తం నిండిపోయింది. ఇక ఉస్మాన్ సాగర్ నీటిమట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1785 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.