శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(SRSP) నిండుగా కనిపిస్తోంది. డ్యాంలోకి వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం 1,80,000 క్యూసెక్కుల ఫ్లడ్(Flood) వస్తుండగా.. 26 గేట్ల ద్వారా అంతే మొత్తంలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా రిలీజ్ చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 90 TMCలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 83.25 TMCల నీరు నిల్వ ఉంచుతున్నారు. ఎగువన ఇంకా వర్షా ల ప్రభావం ఉండటంతో మహారాష్ట్రలోని క్యాచ్ మెంట్ ఏరియాల నుంచి భారీగా వరద వస్తున్నది.