
రాష్ట్రంలోని పురపాలక సంఘాల(Municipalities)కు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,432 పనులకు ఆమోదం తెలిపింది. రూ.2,780 కోట్లు విడుదల చేస్తూ వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి అన్ని చోట్ల అభివృద్ధి పనులకు నిధులు విడుదలయ్యాయి. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నిర్వహణ ఉండేలా పురపాలక శాఖ కార్యక్రమాలు నిర్వహించనుంది. విస్తరణతోపాటు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లోనూ సదుపాయాలు కల్పించాలన్నది సర్కారు లక్ష్యం.