రాష్ట్రంలో రెండో విమానాశ్రయ(Airport) నిర్మాణానికి అడుగులు పడ్డాయి. వరంగల్ మామునూరు(Mamunuru) ఎయిర్ పోర్ట్ భూసేకరణకు రూ.205 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదన్న ఒప్పందాన్ని GMR సంస్థ గతంలోనే విరమించుకోవడంతో లైన్ క్లియరైంది. ఇప్పటికే మామునూరుకు 696 ఎకరాలుండగా, మరో 253 ఎకరాల్ని సర్కారు కేటాయించింది. దీని తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ వద్ద మరో ఎయిర్ పోర్టు రాబోతున్నది. 6 నెలల వ్యవధిలోనే మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.