వరంగల్ సమీపంలోని మామునూరు విమానాశ్రయం(Airport) నిర్మాణం కోసం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన నిధులు విడుదల చేస్తూనే డిజైన్లకు సంబంధించిన DPR(డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారు చేయాలంటూ ఎయిర్ పోర్ట్ అథారిటీకి మంత్రి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లెటర్ రాశారు.
శంషాబాద్ విమానాశ్రయం పరిధిలోని 150 కిలోమీటర్ల లోపల మరో ఎయిర్ పోర్ట్ ఉండకూడదన్న ఒప్పందాన్ని GMR సంస్థ విరమించుకోవడంతో మామునూరు ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే దీని పరిధిలో 696 ఎకరాలు ఉండగా, మరో 253 ఎకరాలు కేటాయిస్తూ అందులో రన్ వే, టెర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) సహా వివిధ సదపాయాలు కల్పిస్తారు.