కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియోజకవర్గాల(Constituency) అభివృద్ధి(Development) కోసం నిధులు విడుదలయ్యాయి. ఒక్కో సెగ్మెంట్ చొప్పున నిధుల్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఆ జిల్లా ఇంఛార్జి మంత్రులకు ఈ నిధుల బాధ్యతల్ని అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా గల 119 నియోజకవర్గాలకు గాను ఒక్కో సెగ్మెంట్ కు రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.1,190 కోట్లను రిలీజ్ చేసింది.
వేటికి ఖర్చు చేయాలంటే…
ప్రస్తుతం కేటాయించిన రూ.10 కోట్లలో ప్రతి నియోజకవర్గంలో రూ.2 కోట్లు విద్య(Education)కు, కోటి రూపాయల్ని తాగునీటికి, మరో 50 లక్షల్ని కలెక్టరేట్లు, గవర్నమెంట్ ఆఫీసుల నిర్వహణకు వాడాలని ఆర్డర్స్ లో తెలియజేసింది.
Published 01 Feb 2024