రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేతన సవరణ కమిషన్(PRC)ని నియమిస్తామని తెలియజేసింది. వేతన సవరణ కమిషన్ తోపాటు IRను వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చింది. తనను కలిసిన ఉద్యోగ సంఘాలకు ఈ మేరకు CM హామీ ఇచ్చారు. PRC ప్రకటించాలని, సమస్యలు తీర్చాలని ఉద్యోగ సంఘాల లీడర్లు కోరారు. స్పందించిన CM వీటిపై రేపు అసెంబ్లీలో ప్రకటన చేస్తామని హామీ ఇచ్చినట్లు సదరు లీడర్లు తెలియజేశారు. రెండో PRCని ఏర్పాటు చేసి 2023 జులై 1 నుంచి అమలయ్యేలా IR ప్రకటించాలని ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కు న్యాయం జరిగేలా చూడాలని సీఎంను ఉద్యోగ సంఘాల లీడర్లు కోరారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం తాము ఇచ్చే చందాతో ట్రస్టు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందేలా EHSను అందుబాటులో ఉంచాలని సూచించారు.
కేంద్రం తెచ్చిన CPS సిస్టమ్ రద్దు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని, ఉద్యోగులకు కేటాయించిన సర్కారు భూమిని భాగ్యనగర్ NGOల హౌజింగ్ సొసైటీకి అప్పగించాలని యూనియన్ లీడర్లు CMను కోరారు. ఉద్యోగ సంఘాల JAC ఛైర్మన్ రాజేందర్, జనరల్ సెక్రటరీ వి.మమత, TGO జనరల్ సెక్రటరీ ఎ.సత్యనారాయణ, TNGO జనరల్ సెక్రటరీ జగదీశ్వర్, అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణగౌడ్.. సీఎం కార్యాలయంలో KCRను కలిశారు.
రాష్ట్రంలో అన్నీ సంబంధించిన .దర్యాప్తు దనెవదము