అన్ని పథకాల(Schemes)కు రేషన్ కార్డు తప్పనిసరి(Mandatory) అయిన పరిస్థితుల్లో కొత్త రేషన్ కార్డులు రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ జరుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తెలియజేశారు. ఇందుకోసం త్వరలోనే గైడ్ లైన్స్ వస్తాయన్నారు.
రాష్ట్రంలో కొత్త కార్డుల కోసం 11 లక్షల అప్లికేషన్లు వస్తే.. ఇపుడున్న కార్డుల్లో రేషన్ తీసుకోనివారు 11 శాతం మంది ఉన్నారు. మహాలక్ష్మీ, ఫ్రీ కరెంటు కోసం గృహజ్యోతి, రైతుబంధు, రైతు భరోసా(Rythu Bharosa), రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటివన్నీ ప్రకటిస్తున్నా… ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులపై మాట లేకపోవడంతో సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తున్నది.