తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే జనవరి నుంచి సన్నబియ్యం సరఫరా చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గల అన్ని డీలర్ల దుకాణాల్లోనూ సన్నబియ్యం పంపిణీ(Distribution) అవుతాయని అధికారులతో నిర్వహించిన రివ్యూలో అన్నారు.
PDS బియ్యం పక్కదారి పట్టడంపైనా చర్చ జరిగింది. ఇకనుంచి బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్షిప్(Dealership) రద్దు చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న 1,629 చౌకధరల దుకాణాల డీలర్ల భర్తీ చేపట్టాలని ఆదేశించారు. హాస్టళ్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకాల్లో నాణ్యత పాటించాలన్న మంత్రి.. అవసరమైన చోట సబ్సిడీ ధరలకు గోధుమలు అందించాలన్నారు.