ఎంతోకాలంగా ఎదురుచూపులకే పరిమితమైన DA విషయంలో ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఈ విషయంలో ఉద్యోగులు(Employees) త్వరలోనే శుభవార్త వింటారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున కొంత సమయం తీసుకోవాల్సి వస్తున్నదని శాసనమండలిలో అన్నారు.
‘రాష్ట్రంలోని ఉద్యోగ వ్యవస్థ అంతా మన కోసం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నది.. పెరిగిన ధరలకు అనుగుణంగా వారికి ఇవ్వాల్సినవన్నీ అందించాల్సిందే.. ప్రస్తుతం కష్ట సమయంలో ఉన్నాం.. ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడే DA ఇవ్వడానికి రెండు నుంచి ఏడేళ్ల సమయం తీసుకున్నారు. ఇప్పుడు అంత టైమ్ తీసుకోకుండా వాటిని ఇచ్చే ఏర్పాటు చేస్తాం.. త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు..’ అని డిప్యూటీ CM అన్నారు.