రానున్న ఐదు రోజుల్లో భారీ(Heavy) వర్షాలు కురిసే అవకాశాలున్నందున విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, CS శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గత రాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్(GHMC), నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటున్నాయని, ఇదే తీరు మిగతా జిల్లాల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని CS స్పష్టం చేశారు. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చిన దృష్ట్యా.. ఆయా జిల్లాల్లో బడుల మూసివేతపై కలెక్టర్లే ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.