ప్రభుత్వ సంస్థలకు అవసరమైన వస్త్రాల(Cloths)ను టెస్కో నుంచి మాత్రమే కొనుగోలు(Purchase) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెస్కో నుంచి కొనడం ద్వారా చేనేత కార్మికులను ఆదుకున్నట్లవుతుందని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. చేనేత, జౌళి శాఖలపై రివ్యూ నిర్వహించిన మంత్రి.. 2025-26కు అవసరమైన ఇండెంట్ ను ఈ నవంబరు 15 లోపు పంపాలని ఆయా డిపార్ట్మెంట్లను ఆదేశించారు. రాబోయే విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల యూనిఫామ్స్ ఇండెంట్ ను టెస్కోకు అందివ్వాలని ఆ శాఖకు స్పష్టం చేశారు. కొన్ని సంక్షేమ శాఖల్లో ప్రతి సంవత్సరం డిజైన్లు మార్చడం వల్ల ఉత్పత్తి ఆలస్యమవుతుందని, కాబట్టి ఒకసారి నిర్ణయిస్తే ఐదేళ్ల వరకు వాటిని మార్చకూడదన్నారు.
ఇకనుంచి అన్ని శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చేనేత వస్త్రాలనే కొనాల్సి ఉంటుంది. టెస్కోకు ఆర్డర్ ఇవ్వకుండా సర్కారు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రైవేటుగా కొనుగోలు చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.