రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్ని ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పరిశీలన చేసిన సర్వే వివరాల్ని మొబైల్ యాప్(App)లో నమోదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల్ని భాగస్వాముల్ని చేస్తూనే సర్వే నిర్వహించే గ్రామంలో ముందు రోజు రాత్రే చాటింపు వేయాలన్నారు. ప్రతి 500 మందికి గాను ఒక సర్వేయర్ ను నియమించుకోవాలని, ఏ ఒక్క అప్లికేషన్ విడిచిపెట్టకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సర్వే వివరాలపై ప్రతి రోజు కలెక్టర్లు సమీక్ష(Review) నిర్వహించడంతోపాటు ప్రతి జిల్లా కేంద్రంలో.. ఫిర్యాదులు, సలహాల కోసం టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలన్నారు.