రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు భారీ వర్షాలు(Heavy Rains) ఉంటాయని, క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన దృష్ట్యా.. సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన CS శాంతికుమారి.. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలు బయటకు రాకుండా చూడాలన్నారు.
వర్షాలు కురిసే జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లకు కట్టబెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి ఆయా ప్రాంతాల్లో బడులకు సెలవులు ప్రకటించుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కలెక్టర్లకు స్పష్టం చేశారు.