317 జీవోవై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు(Orders) జారీ చేసింది. ఈ మేరకు 243, 244, 245 మార్గదర్శకాల(Guidelines)తో కూడిన ఆదేశాలు ఇచ్చింది. మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మూడు కేటగిరీలకు సంబంధించి వేర్వేరు ఆర్డర్స్ జారీ చేసింది. ఖాళీలకు అనుగుణంగా స్థానిక కేడర్లో మార్పు, బదిలీలకు గాను పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేసింది.