ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతుల(Infrastructure)పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీలక ఆదేశాలిచ్చారు. పాఠశాలలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, KGBVల్లో పరిస్థితుల్ని పర్యవేక్షించే బాధ్యతను స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లకు కట్టబెట్టారు. సర్కారు మార్గదర్శకాల(Guidelines) మేరకు జిల్లాలోని అన్ని విద్యాలయాలపై రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలని ఆదేశించారు. క్లాస్ రూమ్స్, హాస్టళ్లు, డార్మెటరీలు, శానిటేషన్, భోజన వసతులపై ఎప్పటికప్పుడు కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలన్నారు.
డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ ఛైర్మన్ గా ఫుడ్ ఐటెమ్స్ పై స్వయంగా చూసుకోవాలని, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 15 రోజులకోసారి ఒకరోజు రాత్రి అక్కడే ఉండాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్లు ఇచ్చే నివేదికలను పరిశీలించి నెలకోసారి కలెక్టర్లు సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బాలికల రెసిడెన్షియల్ స్కూళ్లను అఖిల భారత సర్వీసు(AIS)కు చెందిన మహిళా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశాల్లో CS తెలియజేశారు.