మహిళల ఉచిత ప్రయాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఇప్పటివరకు 70 కోట్ల మంది రాకపోకలు సాగిస్తే అందుకు రూ.2,400 కోట్లు అయితే.. ఇందులో TGRTCకి సర్కారు రూ.2,000 కోట్లు చెల్లించింది. నెలకు రూ.300 కోట్ల చొప్పున చెల్లింపులు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రకటించారు.
యూనియన్లను రద్దు చేసి తమ కుటుంబ సభ్యుణ్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ED)గా నియమించిన గత BRS ప్రభుత్వం.. అసెంబ్లీలో క్షమాపణ చెప్పాకే దీనిపై మాట్లాడాలని మంత్రి అన్నారు. సంస్థకు రాజకీయ రంగు పూసి గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం లేదంటూ నాటకాలాడి ఉద్యోగుల్ని నానా తిప్పలు పెట్టింది KCR సర్కారు కాదా అని ప్రశ్నించారు.
RTC ఉంటదా, తీసేస్తరా అన్న రీతిలో దాన్ని చంపేశారని, ఎవరి అభిప్రాయాల తీసుకోకుండా కమిటీ వేసి పదేళ్లు కాలయాపన(Time Waste) చేశారని పొన్నం మండిపడ్డారు.