కొంతమంది సీఎంలు వ్యవహరిస్తున్న తీరు బాధను కలగజేస్తోందని, తెలంగాణ ముఖ్యమంత్రి సైతం అదే తీరుగా ఉంటున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పుదుచ్చేరిలో పర్యటిస్తున్న ఆమె.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. తమిళనాడు గవర్నర్ ఇచ్చిన టీ పార్టీకి CM స్టాలిన్ అటెండ్ కాకపోవడం మంచిది కాదని అన్నారు. స్టాలిన్ వెళ్లకపోవడం బాధాకరమని, అచ్చంగా తెలంగాణ సీఎం KCR సైతం అలాగే వ్యవహరిస్తున్నారని మాట్లాడారు.