
విలీన ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును పెండింగ్ లో పెట్టిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్… శనివారం అర్థరాత్రి పూట ప్రభుత్వానికి సందేశం పంపించారు. ఆర్టీసీ బిల్లుపై వివరణ ఇవ్వాలంటూ రాజ్ భవన్ వర్గాలు సర్కారుకు సమాచారమిచ్చాయి. వేలాదిగా ఉన్న సంస్థ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్యా ఈ వివరణ కోరుతున్నట్లు రాజ్ భవన్ ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా సమాధానమిస్తే బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని రాజ్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి.