
ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే బిల్లును ఆమోదించాలంటూ ఆందోళన బాట పట్టిన RTC యూనియన్లతో గవర్నర్ తమిళిసై చర్చించారు. రాజ్ భవన్ కు వచ్చిన లీడర్లతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళిసై మాట్లాడారు. గంట పాటు గవర్నర్ తో చర్చించిన నాయకులు సంతృప్తితో వెనుదిరిగారు. బిల్లులో అభ్యంతరాలు ఉన్నందునే వాటిపై ప్రభుత్వాన్ని వివరణ అడిగానని గవర్నర్ వివరించారు. ఫ్యూచర్ లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకే బిల్లును గవర్నమెంట్ కు పంపామని చెప్పడంతో.. యూనియన్ లీడర్లు స్వాగతించారు.
గవర్నర్ మాట్లాడిన తీరుతో తెలంగాణ మజ్దూర్ యూనియన్(TMU) నేత థామస్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. RTC కార్మికులతోనే తాను ఉన్నానంటూ గవర్నర్ చెప్పారని, త్వరలోనే మా బిల్లుకు ఆమోద ముద్ర వేస్తారన్నారని ఆయన ప్రకటించారు.