టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల గడువు నేటితో ముగిసిపోనుండగా దాన్ని మరికొన్ని రోజులు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈనెల 20 వరకు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడం.. తుది గడువు(Final Date) ముగుస్తున్నా స్పందన రాకపోవడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లే కనపడుతున్నది.
వచ్చే నెలలో…
మే 20 నుంచి మొదలయ్యే పరీక్షల(Exams)కు తొలుత ప్రకటించిన ప్రకారం ఈ రోజు సాయంత్రం వరకు అప్లై చేసుకోవడానికి గడువుంది. అయితే నిన్నటి(ఏప్రిల్ 9) వరకు 1.93 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇక ఒక్కరోజే మిగిలి ఉండటంతో అప్లికేషన్ల సంఖ్య 2 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. 2023 సెప్టెంబరులో నిర్వహించిన ‘టెట్’కు 2.91 లక్షల మంది అప్లయ్ చేసుకున్నారు. ఈసారి లక్ష అప్లికేషన్లు తక్కువ రావడంతో మరోసారి గడువును పొడిగించినట్లు భావిస్తున్నారు.