ఆర్టీసీ బిల్లుకు సంబంధించి గవర్నర్ ప్రస్తావించిన అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సర్కారు వివరణ కోరుతూ అర్థరాత్రి 12 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్… నోట్ పంపించారు. తక్షణం వివరణ పంపితే బిల్లు ఆమోదానికి మార్గం సుగమం అవుతుందని రాజ్ భవన్ వర్గాలు ప్రభుత్వానికి సందేశం పంపించాయి. వాటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం… వివరణతో కూడిన ఫైల్స్ ను రాజ్ భవన్ కు పంపించింది.
గవర్నర్ వివరణ కోరిన అంశాలు
గవర్నమెంట్ ఉద్యోగులుగా మారితే పెన్షన్ వస్తుందా… దానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియజేయలేదు.
ఆర్టీసీలో కేంద్రం వాటా ఉంది.. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, లోన్లు ఇతర వివరాలు తెలియజేయలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం విలీన ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారం పంపలేదు.
ప్రమోషన్లు, కేడర్ కు సంబంధించి ఫ్యూచర్ లో అనుసరించే పద్ధతులపై వివరాల్లో క్లారిటీ లేదు..
ఇప్పటిదాకా అమలవుతున్న పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక చట్టం వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడతారు…
ఈ అంశాలతో ప్రభుత్వానికి పంపిన నోట్ లో గవర్నర్ అభ్యంతరాల్ని లేవనెత్తారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వ ఉన్నతాధికారులు… సమాధానాలతో కూడిన ఫైల్స్ ను రాజ్ భవన్ కు పంపించినట్లు స్పష్టం చేశారు.