
స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్లపై జీవో విడుదలైంది. ఈ జీవోను BC సంక్షేమ శాఖ విడుదల చేసింది. మండల, జిల్లా పరిషత్ రిజర్వేషన్ల విధివిధానాల్ని ఖరారు చేస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది. BCలకు 42%, SCలకు 18%, STలకు 9%తో కలిపి 69 శాతం రిజర్వేషన్లు రానున్నాయి. ఇక మహిళా రిజర్వేషన్లు సైతం రేపు ఖరారు చేయడానికి ఏర్పాట్లు చేశారు. రాజకీయ పార్టీల సమక్షంలో డ్రా ద్వారా ఖరారు చేయాల్సి ఉంటుంది. BCలకు కులగణన డేటాతో.. SC, STలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో వచ్చింది.