కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల(Graduate) MLC కౌంటింగ్ లో ఓట్ల విభజనకే రోజున్నర సమయం తీసుకుంటోంది. ఇప్పటివరకు 2.10 లక్షల ఓట్ల విభజన పూర్తవగా, మరో 40 వేలకు ప్రక్రియ నడుస్తోంది. విభజన పూర్తయిన వాటిలో 1.89 లక్షల ఓట్లు చెల్లుబాటయ్యాయి. 21 వేలు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. మొత్తం 2.50 లక్షల ఓట్లు పోలు కాగా, 21 టేబుళ్లలో విభజన చేపడుతున్నారు. అయితే చెల్లుబాటు ఓట్ల విషయంలో అధికారుల నుంచి సరైన క్లారిటీ లేదంటూ పలువురు అభ్యర్థులు ఆందోళనతో ఉన్నారు. అధికారుల మధ్య సమన్వయం(Co-Ordination) లేదని ఆరోపిస్తున్నారు. నిజానికి ఉదయం 10 గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలు కావాల్సి ఉంది. కానీ మరో 40 వేల ఓట్ల విభజన పూర్తయితేనే అసలు లెక్కింపు ఆరంభమవుతుంది.