గ్రూప్-1 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల(Candidates)కు ఎడిట్ అవకాశం కల్పించింది TSPSC. ఈ అవకాశం ఈనెల 23న పొద్దున 10 గంటల నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ ఐదు రోజుల్లో బయోడేటాను సరిచేసుకోవచ్చని అభ్యర్థులకు సూచించింది. www.tspsc.gov.in లోకి లాగిన్ అయి… పేరు, పుట్టిన తేదీ, జెండర్, క్వాలిఫికేషన్/ఫొటో/సంతకం వంటి వివరాల్ని ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు TSPSC తెలిపింది. ఆన్ లైన్ అప్లికేషన్లో ఏదైనా మార్పులు, చేర్పులు చేసుకున్న అభ్యర్థులు.. సంబంధిత సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
భారీగా అప్లికేషన్లు…
గ్రూప్-1 పరీక్షకు భారీస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 3 లక్షల మంది దాకా అప్లయ్ చేసుకోగా… ఈసారి అదనంగా రెండు రోజులు గడువిచ్చింది TSPSC. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ ఎగ్జామ్స్ అక్టోబరు 21 నుంచి నిర్వహించనున్నట్లు కమిషన్ అంతకుముందే తెలియజేసింది.