గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫైనల్ ‘కీ’తోపాటు రిజల్ట్స్ ని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ప్రకటించింది. మొత్తంగా 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్(Mains)కు క్వాలిఫై అయ్యారు.TGPSC అధికారిక వెబ్సైట్(Website)లో అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా ఫలితాలు చూసుకునే అవకాశాన్ని కమిషన్ కల్పించింది.
అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. మెయిన్స్ కు క్వాలిఫై అయినవారి హాల్ టికెట్లను సైతం విడుదల చేసింది. జూన్ 13న ప్రిలిమినరీ ‘కీ’తోపాటు మెయిన్ క్వశ్చన్ పేపర్ ను అందుబాటులో ఉంచింది. మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు వారం రోజుల ముందునుంచే డౌన్లోడ్(Download) చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది.
తెలంగాణ సబార్డినేట్ రూల్స్ 1996 ప్రకారం 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసింది. స్పోర్ట్స్ కోటా కింద క్యాండిడేట్స్ ను త్వరలోనే ప్రకటిస్తామన్న కమిషన్.. తుది ఫలితాలు ప్రకటించాకే ప్రిలిమినరీ, కటాఫ్ మార్కుల్ని వెబ్సైట్లో పెడతామని చెప్పింది.