గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రకటించింది. ఫలితాల వివరాల్ని వెబ్ సైట్(Website)లో చూసుకోవాలని స్పష్టం చేసింది. గతేడాది జులై 1న గ్రూప్-4 పరీక్షలు జరిగాయి. రేవంత్ రెడ్డి సర్కారు వెలువడ్డ తర్వాత ప్రకటించిన తొలి గ్రూప్ ఉద్యోగాలు ఇవే కావడం విశేషం. 8,180 పోస్టులకు గతేడాది పరీక్షల్ని TSPSC నిర్వహించింది. ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరిగాయి. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల జాబితా(List)ను సిద్ధం చేసినట్లు తెలిపిన అధికారులు… సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపికైన వారి వివరాల్ని పంపిస్తామన్నారు.
గతేడాది ఆగస్టు 28 నాడు ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసిన TSPSC.. క్యాండిడేట్స్ నుంచి అభ్యంతరాలు స్వీకరించింది. పేపర్-1లో 7 ప్రశ్నలు తొలగించగా.. 8 క్వశ్చన్స్ కి ఆప్షన్స్ మార్పు చేసినట్లు తెలిపింది. పేపర్-2లో రెండు ప్రశ్నలు తొలగించడంతోపాటు 5 క్వశ్చన్స్ కి ఆప్షన్స్ మార్చింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు(Apply) చేసుకుంటే అందులో 80 శాతం మంది అటెండ్ అయ్యారు. TSPSC చరిత్రలోనే ఈ స్థాయిలో అప్లికేషన్లు రావడం ఇది రెండోసారి. 700 వీఆర్వో ఉద్యోగాలకు 2018లో 10.58 లక్షల మంది అప్లై చేయగా, 7.9 లక్షల మంది ఎగ్జామ్ రాశారు.
Published 09 Feb 2024