గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పరీక్షల తేదీల్ని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ప్రకటించింది. డిసెంబరు 15, 16 తేదీల్లో రెండ్రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
పొద్దున 10 నుంచి 12:30 గంటల వరకు ఒక సెషన్… మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు మరో సెషన్లో పరీక్షలు ఉంటాయి. ఎగ్జామ్స్ కు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు TGPSC స్పష్టం చేసింది.
పేపర్-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్.. 15-12-2024 10AM To 12:30PM
పేపర్-2: హిస్టరీ, పాలిటీ & సొసైటీ.. 15-12-2024 3PM To 5:30PM
పేపర్-3: ఎకానమీ & డెవలప్మెంట్.. 16-12-2024 10AM To 12:30PM
పేపర్-4: తెలంగాణ ఉద్యమం & రాష్ట్ర ఆవిర్భావం.. 16-12-2024 3PM To 5:30PM