గ్రూప్-2 పరీక్షల ఫలితాల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను ప్రకటించింది. 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 2022 డిసెంబరులో వచ్చింది. 2024 డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,49,964 మంది పరీక్షలు రాయగా, అందులో 2,36,649 మందికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. టాపర్ గా నిలిచిన అభ్యర్థికి 447 మార్కులు వచ్చినట్లు కమిషన్ తెలిపింది. ఫైనల్ ‘కీ’ సైతం విడుదలైంది. TGPSC వెబ్ సైట్(Website)లో జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్, ఫైనల్ ‘కీ’ని అందుబాటులో ఉంచింది.