
గ్రూప్-3 సర్టిఫికెట్ల పరిశీలన రేపటినుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 26 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో ఈ కార్యక్రమం ఉంటుందని ప్రకటించింది. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్ సైట్ సందర్శించాలని TGPSC కార్యదర్శి అన్నారు. ఈ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులంతా సర్టిఫికెట్లు తీసుకుని రావాలని స్పష్టం చేశారు. ఏవైనా సందేహాలుంటే అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించాలని, సమయానికి అందరూ తెలుగు విశ్వవిద్యాలయానికి రావాలన్నారు.