గ్రూప్-3 ఫలితాలను TGPSC విడుదల చేసింది. 1,388 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా.. గ్రూప్-2 మాదిరిగానే ఇందులోనూ పురుషులే టాప్ లో నిలిచారు. మొదటి 36 ర్యాంకుల్లో కేవలం ఒక్క మహిళ మాత్రమే ఉండగా టాప్-50లో నలుగురు చోటు దక్కించుకున్నారు. 5,36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 50.24 శాతం మాత్రమే హాజరయ్యారు. 2,49,557మంది జనరల్ ర్యాంకింగ్ లను TGPSC ప్రకటించింది. టాప్ ర్యాంకర్ కు 339.24 మార్కులు రాగా, మహిళా టాపర్ కు 325.15 మార్కులు వచ్చాయి.