గ్రూప్-4 ఫలితాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC విడుదల చేసింది. 8,084 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్ లిస్టును ప్రకటించింది. ఈ లిస్టును TGPSC వెబ్ సైట్ లో ఉంచింది. వివిధ డిపార్ట్మెంట్లకు గాను 8,180 పోస్టుల గ్రూప్-4 భర్తీకి 2022 డిసెంబరు 1న నోటిఫికేషన్ వచ్చింది. 2023 జులై 1 నాడు పరీక్షలు నిర్వహించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తోపాటు ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేశాక 8,084 మందిని ఎంపిక చేసినట్లు TGPSC ప్రకటించింది. రిజల్ట్స్ ను http://www.tspsc.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
సెలక్ట్ అయిన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో పోస్టులను కేటగిరీ వారీగా ప్రకటించారు. ఈ పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 9.51 లక్షల మంది దరఖాస్తు చేయగా, 7.6 లక్షల మంది అటెండయ్యారు. న్యాయ వివాదాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో చాలా కాలం పాటు జనరల్ ర్యాంక్ లిస్టు రాలేకపోయింది. మెరిట్ లిస్టులో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో 70 రోజుల పాటు వెరిఫికేషన్ చేయాల్సి వచ్చింది.