ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్స్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. రానున్న కొద్ది నెలల్లోనే వాటిని నిర్వహించనున్నారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, పరీక్షల తేదీల్ని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రకటించింది. నవంబరు 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. అటు ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తుండగా… అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది.
పరీక్షలు ఇలా…
గత నెలలో పాత నోటిఫికేషన్ ను రద్దు చేసిన TSPSC.. క్యాన్సిల్ చేసిన రోజునాడే కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్-1లో ఏడు పేపర్లు ఉండగా, గ్రూప్-2లో నాలుగు పేపర్లు ఉండనున్నాయి. ఇక గ్రూప్-3లో మూడు పేపర్లు జరుగుతాయని కమిషన్ ప్రకటించింది.
పరీక్ష | తేదీలు | పోస్టులు |
గ్రూప్ 1 | అక్టోబరు 21 | 563 |
గ్రూప్ 2 | ఆగస్టు 7, 8 | 783 |
గ్రూప్ 3 | నవంబరు 17, 18 | 1,388 |