
ఈ నెల 26 నుంచి 31 వరకు అన్ని స్కూళ్లల్లో పఠనోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 1 నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి ఒక పీరియడ్ ను ఇందుకు కేటాయించాలని ఆదేశించింది. క్లాసులో అంతర్భాగంగా పాఠ్యాంశాన్ని ప్రతి సబ్జెక్ట్ టీచర్ 10 నిమిషాల పాటు విద్యార్థులతో గట్టిగా చదివించాలి. కీలక పదాలను బ్లాక్ బోర్డుపై రాయించాలి. లైబ్రరీలోని బుక్స్ చదివేందుకు రోజూ పీరియడ్ కేటాయించాల్సి ఉంటుంది.

రెండు భాషల్లో…
వారంలో 3 రోజులు మాతృభాష, మరో 3 రోజులు ఇంగ్లీష్ లోని కథల పుస్తకాలను చదివించాలి. పిల్లలంతా స్పీడ్ గా చదవడంతోపాటు స్వతంత్ర పాఠకులుగా ఎదగాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తోంది. స్టూడెంట్స్ తో గ్రంథాలయ కమిటీలు ఏర్పాటు చేయడానికి తోడు అన్ని బడుల్లో జులై 10 నుంచి 15 వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరపాలని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. పిల్లల నమోదు కోసం మరోసారి బడిబాట చేపట్టాలని, క్లాస్ లకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించింది.