సొసైటీలు, జోన్ల వారీగా ప్రాధాన్యక్రమంలో ఆప్షన్స్ ఇవ్వాలంటూ గురుకుల పరీక్ష రాసిన క్యాండిడేట్స్ కు గురుకుల బోర్డు స్పష్టం చేసింది. అన్ని సొసైటీలకు ఆప్షన్స్ ఇస్తేనే పోస్టుల కాంపిటీషన్ లో బలంగా నిలిచే అవకాశం ఉంటుందని తెలిపింది. తద్వారా మెరిట్ ప్రాతిపదికగా పోస్టులు దక్కించుకునే అవకాశాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. గురుకుల ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, స్కూల్స్ లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు అన్ని ఆప్షన్స్ ఇస్తేనే అప్లికేషన్ ముందుకు వెళ్తుందని, లేదంటే అక్కడే నిలిచిపోతుందని హెచ్చరించింది. ఎగ్జామ్స్ రాసిన TGT అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ వరకు.. మిగతా పోస్టులకు వచ్చే నెల 3 నుంచి 9 వరకు గడువులోగా ఆప్షన్స్ నమోదు చేయాలని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు ఒక్కో పురుష అభ్యర్థి 10 ఆప్షన్లు, మహిళా అభ్యర్థులు 20 ఆప్షన్ల చొప్పున ఇచ్చారు. గురుకుల పోస్టులకు సంబంధించి జూనియర్, డిగ్రీ లెక్చరర్లు తదితర పోస్టులకు దరఖాస్తు టైమ్ లోనే ఆప్షన్స్ ను బోర్డ్ తీసుకుంది. ఇప్పుడు రిక్రూట్ చేసే పోస్టులన్నీ మల్టీజోన్ వి కావడంతో ఆప్షన్స్ తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7 జోన్లు ఉండగా పురుషులు 35, మహిళలు 70 చొప్పున ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంది. గత రిక్రూట్ మెంట్ లో కొన్ని సొసైటీలకే ఆప్షన్స్ ఇవ్వగా.. పోస్టులను పొందలేని పరిస్థితి ఏర్పడింది. ఈసారి అన్ని సొసైటీలు, జోన్లకు ఆప్షన్లు ఇవ్వడం ద్వారా మెరిట్ ప్రాతిపదిక(Criteria)గా పోస్టులు దక్కించుకునే అవకాశం ఉంటుందని గురుకుల బోర్డు తెలియజేసింది.