
గురుకుల నియామక పరీక్షలు ఆగస్టు 1 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఆన్లైన్ లోనే పరీక్షలు ఉంటాయని గురుకుల విద్యాసంస్థల రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. 9,231 ఉద్యోగాల కోసం 2,63,045 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రెండు రోజుల్లో రానుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జనరల్ గురుకుల పాఠశాలలు.. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పోస్టులకు ఏప్రిల్ 6న మొత్తం 9 నోటిఫికేషన్లు వచ్చాయి.