
జులై 1న జరిగే గ్రూప్-4 ఎగ్జామ్ కు హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ ఎగ్జామ్ కు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 1న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. మొత్తం 8,180 పోస్టులకు 9.51 లక్షల మంది హాజరు కానుండగా.. టీఎస్పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో అప్లికేషన్లు రావడం ఇది రెండోసారి. 700 వీఆర్వో ఉద్యోగాలకు 2018లో 10.58 లక్షల మంది అప్లై చేయగా, 7.9 లక్షల మంది ఎగ్జామ్ కు అటెండ్ అయ్యారు.
