కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూస్తే గెలిచేది ఉందా లేదా అన్నట్లు కనపడుతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. అబద్ధాలతో కూడిన ఆరోపణలు, అమలుకాని హామీలు ఇచ్చిందని ట్విటర్ లో విమర్శించారు. ఆత్మవంచన, చరిత్రను వక్రీకరించడమే పనిగా హస్తం పార్టీ సభ సాగిందని, ఆ పార్టీకి ఓట్లు పడతాయనే గ్యారంటీయే లేదన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు BRS పథకాల(Schemes) నుంచి కాపీ కొట్టినవేనని, అది జాతీయ పార్టీ అయితే రాష్ట్రానికో మేనిఫెస్టో ఎందుకని హరీశ్ విమర్శలు చేశారు.
ైతుబంధు, రైతు బీమా, దళిత బంధు దేశానికంతటికీ ఇస్తారా అని కాంగ్రెస్ పార్టీని హరీశ్ రావు నిలదీశారు.