పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ శాసనసభ్యుల(MLA)పై అనర్హత(Disqualify) వేటు వేయాలన్న పిటిషన్లపై హైకోర్టులో వాడీవేడిగా వాదనలు నడిచాయి. సుప్రీం ఇచ్చిన తీర్పుల్ని అమలు చేయాలంటూ పిటిషనర్లు.. స్పీకర్ ను ఆదేశించే అధికారం లేదంటూ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.
పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలంటూ పాడి కౌశిక్ రెడ్డి, కె.పి.వివేకానందతోపాటు BJP శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం డిస్ క్వాలిఫై చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. పలు హైకోర్టుల తీర్పుల్ని ప్రస్తావించారు.
స్పీకర్ ను ఆదేశించే అధికారం ఈ కోర్టుకు లేదని అడ్వకేట్ జనరల్(AG) గుర్తు చేశారు. మరి ఇప్పటికే మూడు నెలల సమయం గడచిపోయింది కదా అన్న కోర్టు ప్రశ్నకు… స్పీకర్ కు కంప్లయింట్ ఇచ్చి 15 రోజులు కూడా గడవకముందే న్యాయస్థానాన్ని ఆశ్రయించారని జవాబిచ్చారు.
కాబట్టి కేసు విచారణలో ఉన్నందున స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని, న్యాయస్థానం ఆదేశాలు తెలిశాకే స్పీకర్ డిసిషన్ ఆధారపడి ఉంటుందని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి.. తీర్పును రిజర్వ్ చేశారు.