పొద్దున తొమ్మిదయిందంటే చాలు… ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం(First Week)లోనే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి రాష్ట్రమంతటా ఉంది. అటు వాతావరణ శాఖ సైతం హెచ్చరికలు ఇచ్చింది. శుక్రవారం నాడు నాలుగు జిల్లాల్లో 43.5 డిగ్రీలు, మరో తొమ్మిది జిల్లాల్లో 43 డిగ్రీల మేర ఎండలు నమోదయ్యాయి.
మరింత వేడిగా…
శని, ఆదివారాల్లో వడగాలుల ప్రభావం ఉండే అవకాశాలున్నాయని… హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్(Orange Alert)’ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆయా జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండటంతోపాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు ఉండొచ్చని అంచనా వేసింది.