
గోదావరి నదికి భారీ వరద(flood) కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నది(river) నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. అటు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెద్దయెత్తున ప్రవాహం ఉంటోంది. 1,50,000 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,079 అడుగుల మేర నీరుంది. ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీ 90 TMCలు కాగా, ప్రస్తుతం 50 TMCల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ లోకి 34,588 క్యూసెక్కులు వస్తోంది. పూర్తి నీటిమట్టం 1,405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1398 అడుగుల మేర నీరుంది.
కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి బాగా ఉంటోంది. దీని నీటి గరిష్ఠ మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 688 అడుగులు దాటింది. 14 వరద గేట్ల ద్వారా 84,269 క్యూసెక్కుల్ని దిగువకు వదులుతున్నారు. అటు గడ్డెన్న జలాశయానికి నీరు భారీగా వస్తున్నది. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 358.70 మీటర్లు కాగా.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండి 358 మీటర్లకు చేరుకుంది.