గంట వ్యవధిలో 12.3 సెంటీమీటర్ల వర్షం(Rain) పడటంతో రాష్ట్ర రాజధాని అస్తవ్యస్థంగా తయారైంది. జంట నగరాల(Twin Cities) రోడ్లపై వరద పోటెత్తడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. గచ్చిబౌలి-కొండాపూర్, జూబ్లీహిల్స్-సికింద్రాబాద్, బషీర్ బాగ్-దిల్ సుఖ్ నగర్ సహా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని గంటల పాటు కుండపోత వర్షం ఉండటంతో జనం బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరించారు. బంజారాహిల్స్ లో వారాంతపు సంత వర్షార్పణమైంది. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 12.3, ఖైరతాబాద్ లో 11.1, సరూర్ నగర్లో 10.5 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.