ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా పడుతున్న వర్షం.. ఒక్కరోజు వ్యవధిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 20 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షం పడితే.. అందులో 8 జిల్లాల్లో 30 సెంటీమీటర్ల దాకా వాన కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) ప్రకటించింది. ఆగస్టు 31 ఉదయం 8:30 నుంచి సెప్టెంబరు 1 తెల్లవారుజాము 6 గంటల వరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరంలో అత్యధికంగా 29.9 సెం.మీ. వర్షం పడింది.
ఆ ప్రాంతాలు చూస్తే…
జిల్లా | మండలం | ప్రాంతం | వర్షపాతం(సెం.మీ.లో) |
సూర్యాపేట | హుజూర్ నగర్ | లక్కవరం రోడ్ | 29.9 |
మహబూబాబాద్ | ఇనుగుర్తి | ఇనుగుర్తి | 29.8 |
సూర్యాపేట | చిలుకూరు | చిలుకూరు | 29.7 |
మహబూబాబాద్ | నర్సింహులపేట | కొమ్ములవంచ | 29.6 |
ఖమ్మం | తిరుమలాయపాలెం | బచ్చోడు | 29.6 |
మహబూబాబాద్ | దంతాలపల్లె | దంతాలపల్లె | 29.4 |
మహబూబాబాద్ | మహబూబాబాద్ | మల్యాల(ARS) | 29.4 |
మహబూబాబాద్ | మరిపెడ | మరిపెడ | 29.1 |
మహబూబాబాద్ | నర్సింహులపేట | పెద్దనాగారం | 28.8 |
మహబూబాబాద్ | కురవి | అయ్యగారిపల్లె | 28.6 |
మహబూబాబాద్ | చిన్నగూడూర్ | చిన్నగూడూర్ | 28.5 |
ఖమ్మం | తిరుమలాయపాలెం | కాకర్వాయి | 28.2 |
సూర్యాపేట | మఠంపల్లి | మఠంపల్లి | 28 |
సూర్యాపేట | మద్దిరాల | ముకుందాపురం | 27.7 |
వరంగల్ | పర్వతగిరి | కల్లెడ | 26.6 |
మహబూబాబాద్ | మహబూబాబాద్ | మహబూబాబాద్ | 26.6 |
వరంగల్ | నెక్కొండ | రెడ్యావాడ | 25.9 |
సూర్యాపేట | మోతె | ఉర్లుగొండ | 25.9 |
ములుగు | తాడ్వాయి | తాడ్వాయి హట్స్ | 25 |
మహబూబాబాద్ | తొర్రూర్ | తొర్రూర్ | 25 |