రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతాలు రికార్డయ్యాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 13.9, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో 13.2, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లెలో 8.7, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 8.5, భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మల్కారంలో 8.3, ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ ధరి(Pippaldhari)లో 8 సెంటీమీటర్ల వాన కురిసింది. నేటి నుంచి రేపు పొద్దున వరకు కుమురం భీమ్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని నిన్ననే వాతావరణ కేంద్రం ప్రకటించింది.